Krithi Shetty - ఉప్పెన బ్యూటీ బాలీవుడ్ పై కన్ను?

Monday,June 28,2021 - 08:18 by Z_CLU

Uppena heroine Krithi Shetty eyes on Bollywood

ఉప్పెన సినిమా రిలీజ్ కి ముందే యూత్ లో మంచి క్రేజ్ అందుకున్న కృతి శెట్టి ఆ సినిమా రిలీజ్ తర్వాత భారీ స్టార్డం సొంతం చేసుకుంది. ఉప్పెన రిలీజ్ కి ముందే తన క్రేజ్ తో వరుసగా ఆఫర్స్ అందుకున్న కృతి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బిజీ అవ్వాలని చూస్తుందట. ప్రస్తుతం కృతి చేతిలో మూడు సినిమాలున్నాయి. నానితో ‘శ్యామ్ సింగ రాయ్’,సుదీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాల్లో నటిస్తున్న కృతి త్వరలోనే రామ్ -లింగుస్వామి సినిమాలో నటించబోతుంది. ప్రెజెంట్ ఈ మూడు సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న కృతి త్వరలో ఓ హిందీ సినిమా చేయబోతుందని తెలుస్తుంది.

krithi-shetty

ఇటివలే కృతి కి బాలీవుడ్ లో ఓ సంస్థ నుండి కాల్ వచ్చిందట. హీరో -దర్శకుడు అంతా సెట్ అయిన ఈ ప్రాజెక్ట్ త్వరలోనే స్టార్ట్ కానుందని తెలుస్తుంది. ఇక కెరీర్ ఆరంభంలోనే బాలీవుడ్ లో ఆఫర్ రావడంతో ఉబ్బి తబ్బివుతుందట. నిజానికి కృతి పెట్టింది ముంబైలో కాకపోయినా పెరిగింది అంతా అక్కడే. మొదటి హిందీలో మోడల్ గా కొన్ని యాడ్స్ చేసింది కృతి. అప్పటి నుండి అక్కడ మేనేజర్స్ తో ఆమెకి కాంటాక్ట్ ఉంది.

krithi-shetty

ఆ కాంట్రాక్ట్స్ ఇప్పుడు ఈ అమ్మడుకి హిందీ సినిమాలో ఆఫర్స్ తెచ్చిపెట్టిందని అనుకోవచ్చు. పైగా ఉప్పెన బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ సొంతం చేసుకోవడంతో ఈమె క్రేజ్ బాలీవుడ్ కి కూడా రీచ్ అయి ఉంటుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలతో బిజీగా గడిపేస్తున్న కృతి ఇకపై బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా బిజీ అవ్వనుంది. మరి అక్కడ కృతి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics