Oke Oka Jeevitham - శర్వానంద్ కొత్త సినిమా!

Monday,June 28,2021 - 08:26 by Z_CLU

Sharwanand’s New movie titled as Oke Oka Jeevitham

శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెలుగు , తమిళ్ లో ఓ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాడు శర్వానంద్. తాజాగా సినిమాకు టైటిల్స్ ఫిక్స్ చేశారు. తెలుగులో ఈ సినిమాకు ‘ఓకె ఒక జీవితం’ అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. శర్వానంద్ గిటార్ భూజాన వేసుకొని వెనక్కి తిరిగి ఉన్న స్టిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ , ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తూ సందడి చేస్తుంది.

శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమల అక్కినేని ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. డ్రీం వారియర్ పిక్చర్స్ బేనర్ పై SR ప్రకాష్ బాబు , SR బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అక్మ్పోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమా త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకొని తెలుగు , తమిళ్ లో రిలీజ్ కానుంది.

sharwanand new movie oke oka jeevitham 2

అక్టోబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. కెరీర్ ఆరంభంలో తమిళ్ లో సినిమాలు చేసిన శర్వానంద్ కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా నుండి సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ఒక్కొక్కటిగా రిలీజ్ కానున్నాయి. అతి త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారు.