Nithin Venky Kudumula - భీష్మ కాంబో రిపీట్?

Monday,June 28,2021 - 08:10 by Z_CLU

Nithin Venky Kudumula 2nd Movie

వరుస అపజయాలతో కెరీర్ ని కొనసాగిస్తున్న టైంలో నితిన్ కి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు వెంకీ కుడుముల. భీష్మ అనే టైటిల్ తో మంచి మెసేజ్ ఇస్తూ ఎంటర్టైన్ చేశాడు. ఆ తర్వాత నితిన్ మళ్ళీ ట్రాక్ ఎక్కాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ కాంబోలో సినిమా రానుందనే ప్రచారం జరుగుతుంది. అవును ఇటివలే వెంకీ నితిన్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసి నరేషన్ ఇచ్చాడని తెలుస్తుంది.

భీష్మ సక్సెస్ తర్వాత గ్యాప్ తీసుకున్న వెంకీ ఇటివలే వరుణ్ తేజ్ కి ఓ కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడని సమాచారం. అయితే వెంకీ నెక్స్ట్ వరుణ్ తేజ్ తో ఫిక్స్ అనుకునే లోపు మళ్ళీ నితిన్ -వెంకీ కాంబో తెరపైకి వచ్చింది. మరి వెంకీ ముందు వరుణ్ తేజ్ తో సినిమా చేసి ఆ తర్వాత నితిన్ సినిమా చేస్తాడా ? లేదా ముందు నితిన్ తో సినిమా చేసేసి ఆ తర్వాత వరుణ్ తేజ్ సినిమాకి షిఫ్ట్ అవుతాడా ? అనేది తెలియాల్సి ఉంది.

Nithin gifts costly car to Bheeshma Director Venky Kudumula

ప్రస్తుతానికి వెంకీ నెక్స్ట్ సినిమాపై ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం స్క్రిప్ట్స్ పైనే కూర్చొని త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ‘ఛలో’,’భీష్మ’ వంటి వరుస సక్సెస్ ల తర్వాత వెంకీ చేయబోయే హ్యాట్రిక్ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తన హ్యాట్రిక్ సినిమాను ఏ హీరోతో చేస్తాడా ? అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి వెంకీ నుండి నెక్స్ట్ సినిమాపై క్లారిటీ వచ్చే వరకు ఇలాంటి ప్రచారం జరుగుతూనే ఉంటుంది. త్వరలోనే వెంకీ సినిమా ఎనౌన్స్ అయితే క్లారిటీ వచ్చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ లో వెంకీ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి అదే బేనర్ లో సినిమా ఉంటుందా ? అనేది కూడా తెలియాల్సి ఉంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics