ఒకేసారి ఇద్దర్నీ లైన్లో పెట్టేశాడు....

Sunday,October 30,2016 - 10:45 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఒకడైన త్రివిక్రమ్ మహేష్, పవన్ ఇద్దరితో సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ఈమధ్యే నితిన్-సమంతతో ‘అ ఆ’ సినిమా తీసి తన మేజిక్ తో 50 కోట్లు కొల్లగొట్టిన మాటల మాంత్రికుడు ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకున్నప్పటికీ… పవన్ , మహేష్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేయబోతున్నాడు. వీరిద్దరితో సినిమా చేశాకే మరో హీరోకు ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు..

collage-212

జల్సా తో  సూపర్ హిట్ ఇచ్చి రెండో సినిమా ‘అత్తారింటికి దారేది’ తో గ్రాండ్ హిట్ అందించిన త్రివిక్రమ్ పవర్ స్టార్ తో మూడోసారి వర్క్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం కథ రెడీ చేస్తున్న ఈ స్టార్ డైరెక్టర్… మరో వైపు మహేష్ తో కూడా మూడోసారి సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే మహేష్ తో ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు చేసిన త్రివిక్రమ్… వచ్చే ఏడాది చివర్లో మహేష్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాల మధ్యలో ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసి యంగ్ హీరో తో ఒక చిన్న సినిమా తీసేందుకు కూడా రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.