'నేను లోకల్' మోషన్ పోస్టర్

Sunday,October 30,2016 - 03:46 by Z_CLU

ఈ దీపావళికి ఇప్పటికే తన కొత్త సినిమా “నేను లోకల్” ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన నాని.. ఇప్పుడు దీపావళి హీట్ ను మరింత పెంచాడు. సరిగ్గా 24 గంటల తేడాలో మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశాడు. ఫస్ట్ లుక్ సందర్భంగా విడుదల చేసిన స్టిల్ నే మోషన్ పోస్టర్ కింద విడుదల చేసినప్పటికీ.. దానికి దేవిశ్రీ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది.

దిల్ రాజు నిర్మాణం లో త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది.