తమ్ముడిని చూసి భయపడుతున్న సూర్య..?

Sunday,October 30,2016 - 10:20 by Z_CLU

విలక్షణ పాత్రలు, వెరైటీ సినిమాలతో హీరోగా తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న హీరో సూర్య. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా సూర్యకు ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఈ హీరో తన తమ్ముడ్ని చూసి భయపడుతున్నాడు. కార్తి ఎక్కడ తనను క్రాస్ చేస్తాడోనని టెన్షన్ ఫీల్ అవుతున్నాడు.

kaashmora-movie-poster

అదేంటి? ఎప్పుడు తన నటన తో అందరికీ షాక్ ఇచ్చే సూర్య… తమ్ముడ్ని చూసి భయపడ్డం ఏంటి అనుకుంటున్నారా…?ఇటీవలే కార్తీ నటించిన ‘కాష్మోరా’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో తన తమ్ముడు యాక్టింగ్ చూసి షాక్ అయ్యాడట సూర్య. కార్తి చేసిన రెండు క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని… ముఖ్యంగా రాజ్ నాయక్ క్యారెక్టర్ తో కార్తీ నటన మైండ్ బ్లోయింగ్ అంటూ సోషల్ మీడియాలో తన తమ్ముడు గురించి చెప్పుకొచ్చాడు.