సూపర్ స్టార్ సరసన త్రిష

Tuesday,August 21,2018 - 10:56 by Z_CLU

ఎట్టకేలకు త్రిష కల నెరవేరింది. దాదాపు 15 ఏళ్లుగా పరిశ్రమలో కొనసాగుతున్న ఈ బ్యూటీ, ఎట్టకేలకు సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అవును.. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న కొత్త సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకున్నారు. మొత్తానికి తన చిరకాల కోరిక నెరవేరిందంటూ త్రిష ట్వీట్ చేసి, తన ఆనందాన్ని పంచుకుంది.

అయితే కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలో త్రిష మాత్రమే హీరోయిన్ కాదు. ఇందులో ఇప్పటికే సిమ్రాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు కూడా రజనీకాంత్ తో నటించడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు త్రిష కూడా జాయిన్ అయింది. ఇలా ఒకే సినిమాలో ఇద్దరు సీనియర్ భామలకు ఛాన్స్ ఇచ్చాడు రజనీకాంత్.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు సూపర్ స్టార్. పగలు హాస్టల్ వార్డెన్ లా, రాత్రిళ్లు డాన్ గా కనిపిస్తాడు. రీసెంట్ గా ఈ సినిమా డెహ్రాడూన్ లో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది.