శైలజారెడ్డి అల్లుడు సినిమా వాయిదా

Tuesday,August 21,2018 - 10:41 by Z_CLU

లెక్కప్రకారం ఈనెల 31న థియేటర్లలోకి రావాలి శైలజారెడ్డి అల్లుడు సినిమా. ఈ వీకెండ్ ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా వాయిదాపడింది. కేరళ వరదలు ఈ సినిమా పోస్ట్ పోన్ కు కారణం.

అవును.. కేరళలో వరదల కారణంగా శైలజారెడ్డి సినిమా విడుదల ఆగిపోయింది. కేరళ వరదలకు, శైలజారెడ్డికి సంబంధం ఉంది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న గోపీసుందర్ కు కొచ్చిలో సొంత స్టుడియో ఉంది. అక్కడే శైలజారెడ్డి అల్లుడు రీ-రికార్డింగ్ జరుగుతుంది. వరదల వల్ల ఆ పని ఆగిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా నాగచైతన్య వెల్లడించాడు.

సినిమాకు సంబంధించి మరో విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారని చైతూ ప్రకటించాడు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. మరో 10 రోజుల్లో శైలజారెడ్డి అల్లుడు రీ-రికార్డింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిపోతాయి. కుదిరితే సెప్టెంబర్ రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.