Sridevi Soda Center - టాప్-5 హైలెట్స్

Thursday,August 26,2021 - 01:34 by Z_CLU

రేపు గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది శ్రీదేవి సోడా సెంటర్ మూవీ. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 500కు పైగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతానికి 528 స్క్రీన్స్ దక్కాయి. ఈ రాత్రికి మరో 30 స్క్రీన్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది.

సెకెండ్ వేవ్ తర్వాత భారీగా రిలీజ్ అవుతున్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది శ్రీదేవి సోడా సెంటర్. సినిమాపై భారీ అంచనాలు ఉండడమే దీనికి కారణం. గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో మేజర్ హైలెట్స్ ఏంటో చూద్దాం.

Sridevi Soda Center Highlight 1 – స్టోరీలైన్
ఈ సినిమాకు మెయిన్ అండ్ మేజర్ హైలెట్ స్టోరీలైన్. ఇప్పటివరకు ఏ హీరో టచ్ చేయని స్టోరీతో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా వస్తోంది. సుధీర్ బాబును స్టార్ హీరోల లిస్ట్ లో చేర్చే సినిమా ఇదే అవుతుందంటూ అంతా అంచనా వేస్తున్నారంటే దానికి కారణం ఈ కథలో ఉన్న కొత్తదనం, ఇంటెన్సిటీ. సుధీర్ బాబు కూడా ఈ ఎలిమెంట్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు.

Sridevi Soda Center Highlight 2 – సుధీర్ బాబు
కథ తర్వాత ఈ సినిమాకు మేజర్ హైలెట్ సుధీర్ బాబు. ఈ స్టోరీలో నటించడానికి ఒప్పుకున్న మరుక్షణం నుంచి పాత్ర కోసం ప్రాణం పెట్టేశాడు సుధీర్ బాబు. ఫిజిక్ ను కాపాడుకోవడంతో పాటు యాక్టింగ్ పరంగా ఎంతో కష్టపడ్డాడు. తన శక్తి మొత్తం ఈ సినిమాపైనే పెట్టాడు. రిస్కీ ఫైట్స్ చేయడంతో పాటు ఎంతో శ్రమపడ్డాడు. అతడు చేసిన సూరిబాబు పాత్ర, సుధీర్ బాబుకు గుర్తింపు తెచ్చిపెట్టడంతో పాటు.. టాలీవుడ్ లో బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలిచిపోతుందనే టాక్ వినిపిస్తోంది.

Sridevi Soda Center Highlight 3 – మ్యూజిక్
కథ, సుధీర్ బాబు తర్వాత మూడో మేజర్ హైలెట్ మ్యూజిక్. ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయిన మణిశర్మ, శ్రీదేవి సోడా సెంటర్ కు సంగీతం అందించాడు. మందలోడా అనే మాస్ సాంగ్ తో పాటు నాలోనే ఉన్నా అనే మెలొడీ సాంగ్ తో దుమ్ముదులిపాడు. వీటితో పాటు మిగతా సాంగ్స్ అన్నీ హిట్టయ్యాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. ట్రయిలర్ కు మణి సర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. సినిమాలో మణి మ్యాజిక్ చూడబోతున్నారు ఆడియన్స్

Sridevi Soda Center Highlight 4 – డైరక్టర్
ఈ సినిమాకు మరో మెయిన్ హైలెట్ దర్శకుడు కరుణకుమార్. పలాస సినిమాతో తానేంటో, తన కథలేంటో, తన టేకింగ్ ఏంటో ఆడియన్స్ కు రుచిచూపించాడు కరుణ కుమార్. టోటల్ ఇండస్ట్రీని తనవైపు తిరిగేలా చేసుకున్నాడు. సో.. ఇలాంటి డైరక్టర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా టేకింగ్ పరంగా మెప్పిస్తుంది. సినిమా అత్యంత సహజంగా ఉండబోతోందనే విషయం టీజర్/ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతోంది.

Sridevi Soda Center Highlight 5 – ప్రొడక్షన్ వాల్యూస్
లాస్ట్ బట్ నాట్ లీస్ట్, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు మరో మేజర్ హైలెట్ గా నిలవబోతోంది ప్రొడక్షన్ వాల్యూస్. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారు నిర్మాతలు విజయ్, శశి. సినిమాలో గోదావరి నదిలో పడవ పందాల ఎపిసోడ్ చూస్తే, ప్రొడక్షన్ పరంగా వీళ్లు ఏ రేంజ్ లో ఉన్నారో చెప్పేయొచ్చు. సినిమాకు ఆ ఎపిసోడ్ మేజర్ హైలెట్ కాబోతోంది. ఇలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ఖర్చుకు వెనకాడకుండా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను నిర్మించింది 70mm ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics