Keerthy Suresh - పాత్రల కోసం మెంటల్లీ ప్రిపేర్ అవుతాను

Thursday,August 26,2021 - 12:17 by Z_CLU

కీర్తిసురేష్ లో ఎంత టాలెంట్ ఉందనే విషయం మనందరికీ తెలిసిందే. మహానటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డ్ కూడా అందుకుంది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పాత్రల కోసం ఎలా ప్రిపేర్ అవుతుంది. ఇదే ప్రశ్న కీర్తిసురేష్ కు ఎదురైంది. దీనికి ఆమె కాస్త డిఫరెంట్ గా సమాధానం ఇచ్చింది.

keerthy Suresh new stills zeecinemalu

కొత్త పాత్రలు అనగానే చాలామంది మేకోవర్ అయిపోతుంటారు. రకరకాలుగా ముఖాన్ని, శరీరాన్ని
మార్చేసుకుంటారు. కానీ తను మాత్రం పాత్ర కోసం మానసికంగా సిద్ధమౌతానంటోంది కీర్తిసురేష్. ఓ క్యారెక్టర్ కు ఒప్పుకున్న తర్వాత, ఆ పాత్ర కోసం తన మనసు స్ట్రగుల్ అవుతుందని, అలా సెట్స్ పైకి వచ్చేసరికి క్యారెక్టర్ కోసం పూర్తిస్థాయిలో మానసికంగా సిద్ధమౌతానని అంటోంది.

keerthy suresh new stills zeecinemalu

కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆమె ఇదే పద్ధతి ఫాలో అవుతోందట కీర్తిసురేష్. నిజానికి ఇదే సరైన పద్ధతి కూడా. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ క్యారెక్టర్ పండుతుందని, భౌతిక రూపాన్ని తెలుసుకొని అలా మారడం వల్ల ఉపయోగం ఉండదని.. ఎన్నో ఏళ్ల కిందటే లెజెండ్ అక్కినేని చెప్పారు. అదే విషయాన్ని కీర్తిసురేష్ ఇప్పుడు తనదైన స్టయిల్ లో చెబుతోంది.

keerthy suresh new stills

ముందుగా మెంటల్లీ ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు శారీరంగా సిద్ధమౌతానంటోంది కీర్తిసురేష్. అందుకే గతంలో బొద్దుగా ఉన్న తను, ఇప్పుడు చాలా కిలోలు తగ్గి స్లిమ్ గా మారానంటోంది. ఇకపై కూడా ఇలా స్లిమ్ ఫిజిక్ నే కంటిన్యూ చేస్తానంటున్న ఈ బ్యూటీ.. క్యారెక్టర్ కోసం అవసరమైతే బరువు పెరుగుతానని చెబుతోంది.

Mahesh sarkaru vaari paata movie stills

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో సర్కారువారి పాట, భోళాశంకర్ సినిమాల్లో నటిస్తోంది. సర్కారువారి పాట సినిమాలో మహేష్ సరసన హీరోయిన్ గా.. భోళాశంకర్ లో చిరంజీవికి చెల్లెలిగా కనిపించబోతోంది కీర్తిసురేష్. ఈ రెండు సినిమాలకు తనకు మరింత పేరు తెచ్చిపెడతాయని నమ్మకంగా చెబుతోంది.

bhola shankar

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics