Weekend Release - ఈ వారం 6 సినిమాలు

Thursday,August 26,2021 - 03:08 by Z_CLU

ఎప్పట్లానే ఈ వారం కూడా బాక్సాఫీస్ బరిలో గట్టిపోటీ కనిపిస్తోంది. రేపు ఏకంగా 6 సినిమాలు థియేటర్లలోకి  వస్తున్నాయి. సుధీర్ బాబు నటించిన శ్రీదేవి సోడా సెంటర్, సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాల మధ్య పోటీ నడిచేలా ఉంది.

సుధీర్ బాబు, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా శ్రీదేవి సోడా సెంటర్. కరుణ కుమార్ డైరక్ట్ చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సాంగ్స్ పెద్ద హిట్టవ్వడంతో పాటు ట్రయిలర్ సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ అంచనాలు ఇంకాస్త పెరిగాయి. ప్రమోషన్ కూడా గట్టిగా చేశారు. ఇప్పుడు ఏకంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రీదేవి సోడా సెంటర్ ప్రమోషన్ కోసం రంగంలోకి దిగడంతో ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

శ్రీదేవి సోడా సెంటర్ కు పోటీగా వస్తోంది ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా. సుశాంత్ హీరోగా నటించిన ఈ సినిమాతో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా, దర్శన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ సినిమా ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు త్రివిక్రమ్ స్పెషల్ గెస్ట్ గా రావడంతో మూవీ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. అర్బన్ బ్యాక్ డ్రాప్ తో కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా, రియల్ లైఫ్ స్టోరీగా వస్తోంది ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా.

నిర్మాణ సంస్థ‌, డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ తొలి ప్రయత్నంగా తీసిన సినిమా ‘హౌస్ అరెస్ట్‌’. శ్రీనివాస్ రెడ్డి, స‌ప్త‌గిరి, అదుర్స్ ర‌ఘు, ర‌విప్ర‌కాశ్‌, ర‌విబాబు, తాగుబోతు ర‌మేష్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్రా ద‌ర్శ‌క‌త్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఓ పెద్ద ఇంట్లో జరిగే కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.

Vivaha_Bhojanambu_movie_satya-zeecinemalu

ఈ సినిమాలతో పాటు సూర్యాస్తమయం, గ్రేట్ శంకర్, వివాహ భోజనంబు సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. వీటిలో సూర్యాస్తమయం, గ్రేట్ శంకర్ సినిమాలు థియేటర్లలోకి వస్తుండగా.. కమెడియన్ సత్య హీరోగా మారి నటించిన వివాహభోజనంబు సినిమా ఓటీటీలో డైరక్ట్ గా రిలీజ్ అవుతోంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics