అనుకున్నదొకటి అయింది ఇంకొకటి

Wednesday,February 20,2019 - 03:33 by Z_CLU

మోడలింగ్ బ్యాక్ డ్రాప్ ఉంటే హీరోయిన్ గా రాణించడం పెద్ద విషయమేం కాదు. కానీ డిఫెరెంట్ బ్యాక్ డ్రాప్ తో అసలు గ్లామర్ ఫీల్డ్ తో సంబంధం లేకుండా కూడా, వస్తూవస్తూనే తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు కొందరు హీరోయిన్స్. వాళ్ళ ఫస్ట్ ప్రొఫెషన్ ని మళ్ళీ కంటిన్యూ చేస్తారో లేదో తెలీదు కానీ, సినిమాల నుండి వీరికి ఇప్పట్లో గ్యాప్ దొరికే అవకాశం అయితే కనిపించడం లేదు.

సాయి పల్లవి : బేసిగ్గా డ్యాన్సర్. కానీ కావాలనుకున్నది మాత్రం డాక్టర్. తను మెడిసిన్ చేస్తున్నప్పుడు వచ్చింది ‘ఫిదా’ లో చాన్స్. అయినా చదువు అయ్యాకే సెట్స్ పైకి వస్తాననడంతో ఫిల్మ్ మేకర్స్ కూడా ఆమె కోసం వెయిట్ చేసి మరీ సినిమా చేశారు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నా, డాక్టర్ ప్రొఫెషన్ ని మాత్రం అస్సలు వదులుకోనంటుందీ భామ.

 

రితిక సింగ్: ‘గురు’ సినిమాతో టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ అయింది ఈ బాక్సర్. సినిమాలో బాక్సర్ రోల్ కాబట్టి బాక్సర్ అయితేనే బెస్ట్ గా పెర్ఫామ్ చేస్తుందని సుధా కొంగర పట్టుబట్టి మరీ ఈ సినిమాలో నటించేలా చేసింది. ఈ సినిమా తరవాత రితిక మళ్ళీ బాక్సింగ్ చేస్తుందో లేదో కానీ, సౌత్ లో మాత్రం బిజీ హీరోయిన్ అయిపోయింది.

రెజీనా: తెలుగులో ‘SMS’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన రెజీనా, నిజానికి యాంకర్ గా కరియర్ బిగిన్ చేసింది. ఆ తరవాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించడంతో, ఈజీగా సినిమా అవకాశాలు రావడం బిగిన్ అయ్యాయి.

 

అనుష్క : నటినవ్వాలని కనీసం కలలో కూడా అనుకుని ఉండదు. ఓ సింపుల్ యోగ టీచర్. అసలు గతంలో నటన అంటే పరిచయం కూడా లేని బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చింది అనుష్క. నాగ్ ‘సూపర్’ సినిమాతో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు.