సందీప్ రెడ్డి అక్కడ కూడా క్లిక్ అవుతాడా..?

Wednesday,February 20,2019 - 01:38 by Z_CLU

అర్జున్ రెడ్డి సినిమా డెఫ్ఫినెట్ గా ఇండస్ట్రీ రివొల్యూషనే. అందునా అది సందీప్ రెడ్డి వంగకి ఫస్ట్ సినిమా మరీ. తన కథని ఎంత నమ్ముకోకపోతే అంత ధైర్యంగా బరిలోకి దిగుతాడు..? అయితే ఈ గట్స్ బాలీవుడ్ లో కూడా కలిసొస్తాయా..? సౌత్ నుండి బాలీవుడ్ కెళ్ళి సక్సెస్ కొట్టిన దర్శకుల లిస్టులో సందీప్ రెడ్డి వంగ స్పేస్ క్రియేట్ చేసుకోగలడా..?

ఇలాంటి అనుమానం క్రిష్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్  తో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ అనౌన్స్ చేసినప్పుడు కూడా కలిగింది. మెగాస్టార్ ‘ఠాగూర్’ కి రీమేక్ ఇది. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు క్రిష్. హమ్మయ్య ఇక్కడ కూడా డైరెక్టర్ అనిపించుకున్నాం అనుకున్నా అంతటితో ఆగలేదు. ఇక్కడో 2 సినిమాలు చేసేసి, ఇమ్మీడియట్ గా ‘మణికర్ణిక’ చేశాడు. దాని రిలీజ్ కి ముందే NTR బయోపిక్ సెట్స్ పైకి వచ్చేశాడు. ఓవరాల్ గా తెలుగు, హిందీ 2 ఇండస్ట్రీలలోను ఏ మాత్రం పట్టు సడలకుండా చూసుకుంటున్నాడు.

ఇక ఈ వరసలో ప్రభుదేవా కూడా ఈజీగా వచ్చేస్తాడు. కొరియోగ్రాఫర్ గా స్టార్ట్ అయ్యాడు. ఆ తరవాత హీరోగా నటించాడు. తెలుగు, తమిళ సినిమాలను ఒకే స్థాయిలో మెయిన్ టైన్ చేశాడు. అలాగని అక్కడే ఉండిపోలేదు. బాలీవుడ్ ను టార్గెట్ చేశాడు.. అదీ సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ తో… ‘వాంటెడ్’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో అంత పెద్ద స్టార్ కే టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు అని చెప్పుకున్నారంతా… ఆ తర్వాత వరసగా రౌడీ రాథోడ్, రామయ్య వస్తావయ్య (హిందీ), యాక్షన్ జాక్సన్, సింగ్ ఈజ్ బ్లింగ్.. సినిమాలకు దర్శకత్వం వహించాడు.

అందరిలాగే అమితాబ్ బచ్చన్ ఇన్స్ పిరేషన్ పూరి జగన్నాథ్ కి. అందుకే  ఏకంగా ఆయనతోనే  బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ‘బుడ్ఢా హోగా తేరా బాప్’ కి దర్శకత్వం వహించాడు. ఆ తరవాత మళ్ళీ హిందీ సినిమా టాపిక్ రాకపోయినా, బాలీవుడ్ డైరక్టర్స్ లిస్టులో సక్సెస్ ఫుల్ మార్క్ అయితే క్రియేట్ చేసుకోగలిగాడు పూరి.

మురుగదాస్ అంటే సౌత్ సినిమా ఇండస్ట్రీలో జస్ట్ ఫిల్మ్ మేకర్ కాదు, బ్రాండ్. ఆ స్టాండర్డ్స్ ని బాలీవుడ్ లో కూడా మెయిన్ టైన్ చేస్తున్నాడు మురుగదాస్. ‘గజిని’ రీమేక్ తో బాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన ఈ ఫిల్మ్ మేకర్, ఆ తరవాత హాలీడే, అకీరా లాంటి డిఫెరెంట్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు.

ఇప్పుడీ వరసలో చేరాలనుకుంటున్న సందీప్ రెడ్డికి బాలీవుడ్ కలిసొస్తుందా..? అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ అక్కడ కూడా అదే స్థాయిలో సక్సెస్ అవుతుందా..? అనేది చూడాలి.