దీపావళి స్పెషల్

Saturday,October 15,2016 - 09:14 by Z_CLU

దసరా సరదాగా సూపర్ హిట్ సినిమాలతో సూపర్ స్పీడ్ గా గడిచిపోయింది. కానీ దీపావళి అంతకన్నా ఎన్నో రెట్ల సంబరాలతో రెడీ అవుతుంది. ఈ సారి ఏకంగా ఇండస్ట్రీ బడాబడా స్టార్ సినిమాల సర్ ప్రైజెస్ తో వెలుగులు నింపుకోనుంది. మురుగదాస్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు దసరా సీజన్ లో పెద్దగా సందడి చేయకపోయినా దీపావళికి మాత్రం టీజర్ లేదా కనీసం టైటిల్ నైనా అనౌన్స్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు.
48649711
ఇక దీపావళి కానుకగా మెగాస్టార్ చిరంజీవి కూడా అభిమానుల కోసం ఏదో ఒక కొత్త స్టిల్ రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఐటెంసాంగ్ షూటింగ్ జరుగుతోంది కాబట్టి… “ఖైదీ నం 150” లోంచి తన డాన్స్ స్టిల్ ను విడుదల చేసే అవకాశాలున్నాయి. దాంతో పాటు దసరాకి ‘ధృవ’ టీజర్ తో విష్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దీపావళికి మరిన్ని స్టిల్స్ తో పాటు ఆడియో రిలీజ్ డేట్ ని కూడా ఎనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి.
bahubali5
ఇక బాహుబలి విషయానికి వస్తే ఈ నెల మొత్తం పండగే అని ప్రకటించిన సినిమా యూనిట్ ఎట్ లీస్ట్ కొన్ని ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేయడమైతే గ్యారెంటీ. పైగా అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ని విడుదల చేయాలని డిసైడ్ అయిన బాహుబలి టీం, దీపావళికి రానాకు సంబంధించిన క్లిప్ ఏదైనా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉందట.