మళ్ళీ మళ్ళీ..
Saturday,October 15,2016 - 09:34 by Z_CLU
మెగాస్టార్ రీఎంట్రీ అనగానే చాలా మంది డైరెక్టర్స్ కథలు పట్టుకొని చిరు ముందు వాలిపోయారు. కానీ తనకు ‘ఠాగూర్’ వంటి గ్రాండ్ హిట్ అందించిన వినాయక్ కు మరో సారి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు మెగా స్టార్ చిరంజీవి. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఖైదీ నెం 150’ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి.
డైరెక్టర్ ను రిపీట్ చేస్తున్న స్టార్ హీరో ల లిస్ట్ లో ముందున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటికే ‘కరుణాకరన్’,’పూరి’,’త్రివిక్రమ్’ వంటి దర్శకులను రిపీట్ చేసిన పవన్ మరో సారి డైరెక్టర్ డాలీ కి ఛాన్స్ ఇచ్చి ‘కాటమరాయుడు’ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే త్రివిక్రమ్ తో మూడో సారి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
‘శ్రీమంతుడు’ తో తనకు బిగ్ హిట్ ఇచ్చిన కొరటాలను మరోసారి రిపీట్ చేస్తున్నాడు మహేష్. ఇప్పటికే ‘గుణశేఖర్’,’పూరి జగన్నాథ్’,’త్రివిక్రమ్’,’శ్రీకాంత్ అడ్డాల’ లతో రెండో సారి పని చేసిన మహేష్ ఆ లిస్ట్ లో కొరటాల పేరును కూడా చేర్చాడు. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్ త్వరలోనే కొరటాలతో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.
ఈ లిస్ట్ లో త్వరలోనే చేరడానికి రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇప్పటికే వినాయక్,రాజమౌళి,సురేందర్ రెడ్డి వంటి దర్శకులతో రెండో సారి పని చేసిన తారక్… పూరి జగన్నాథ్ తో మరోసారి వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నాడట. జనతా గ్యారేజ్ తరువాత చాలామంది డైరెక్టర్స్ తారక్ తో సినిమా చేసేందుకు రెడీ గా ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ మాత్రం పూరీకే ఓటేసినట్టు తెలుస్తోంది. ఈ రిపీట్ లిస్ట్ లోకి రవి తేజ కూడా చేరబోతున్నాడు. ‘పవర్’ దర్శకుడు బాబీ తో కలిసి మరో సినిమా చేసేందుకు మాస్ మహారాజ్ రెడీ అవుతున్నాడు.