బిగ్ బికి కొత్త తలనొప్పి..?

Saturday,October 15,2016 - 09:00 by Z_CLU

కరణ్ జోహార్ సినిమా “ అయ్ దిల్ హై ముష్కిల్’” టైటిల్ కి తగ్గట్టే కష్టాల్లో పడింది. ఐశ్వర్యా రాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ లతో పాటు పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ ఒక ముఖ్య పాత్రలో నటించిన అయ్ దిల్ హై ముష్కిల్ సెన్సార్ నుండి ఇలా బయటికి వచ్చిందో లేదో రూమర్ల గోతిలో కూరుకుపోయింది. దీపావళిన రిలీజ్ కి రెడీగా ఉన్న “అయ్ దిల్ హై ముష్కిల్” లో రణబీర్ సరసన ఐశ్వర్యా రాయ్ నటించిన విషయం తెలిసిందే. అయితే వారిద్దరి మధ్య సందర్భానుసారంగా వచ్చే కొన్ని హాట్ సీన్స్ పై సెన్సార్ కాస్త గట్టిగానే తమ కత్తెర ఝళిపించిందని సమాచారం. దానికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన స్టిల్స్ చూస్తుంటే ఈ సినిమా చుట్టూ తిరుగుతున్న రూమర్స్ జస్ట్ రూమర్స్ కాదేమో అన్న ఆలోచన కూడా వస్తుంది.
aish-2
కొన్ని పత్రికలైతే ఏకంగా బిగ్ బి ప్రతిష్ట కు మచ్చ తెచ్చే అంశాలను కూడా హైలెట్ చేస్తూ కూడా ఆర్టికల్స్ ప్రచురించాయి. ఏది ఏమైనా సినిమా యూనిట్ మాత్రం ఈ రూమర్లను కొట్టిపారేస్తోంది. మా సినిమా క్లీన్ UA సర్టిఫికెట్ తో ఒక కట్ కూడా లేకుండా బయటికి వచ్చిందని చెప్పుకుంటుంది. మరోవైపు సెన్సార్ బోర్డ్ కూడా రంగంలోకి దిగింది. బిగ్ బి ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా సినిమా లేదని ప్రకటించింది.