రిపీట్ అంటున్న దర్శకులు

Sunday,August 12,2018 - 10:14 by Z_CLU

ఓ డైరెక్టర్ హిట్టు కొడితే చాలు అతనితో సినిమాను నిర్మించిన నిర్మాత వెంటనే ఆ డైరెక్టర్ పై కర్చీపు వేసి మరో సినిమాకు కమిట్ చేసేస్తాడు.. పరిశ్రమలో ఇది ఎప్పటి నుండో జరుగుతుందే.. అయితే ప్రస్తుతం బడా నిర్మాతలు కొందరు డైరెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ గా వారితోనే సినిమాలు నిర్మిస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. అలా ఒకే బ్యానర్ లో కంటిన్యూ గా సినిమాలు చేస్తూ నిర్మాతలతో వన్స్ మోర్ అనిపించుకుంటున్న ప్రస్తుత దర్శకులెవరో..చూద్దాం.

వన్స్ మోర్ బ్యాచ్ లో ముందుగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించే… త్రివిక్రమ్ ఇప్పటి వరకూ ఓ పది సినిమాలు డైరెక్ట్ చేస్తే అందులో నాలుగు సినిమాలు హారికా & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో చేసినవే… ఈ బ్యానర్ లో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమా చేసిన త్రివిక్రమ్ ఆ సినిమా నుండి కంటిన్యూగా ఇదే బ్యానర్ లో సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ బ్యానర్ లో ఎన్.టి.ఆర్ తో ‘అరవింద సమేత’ సినిమా చేస్తున్న త్రివిక్రమ్ నెక్స్ట్ వెంకటేష్ తో చేయబోయే సినిమాను కూడా ఇదే బ్యానర్ లోనే చేయనున్నాడు. సో ఒక విధంగా హారికా & హాసినీ బ్యానర్ త్రివిక్రమ్ సొంత బ్యానర్ లాంటిదే.


దిల్ రాజు బ్యానర్ లో దర్శకుడిగా ఓ సినిమా చేస్తే చాలు వెంటనే మరో ఆఫర్ అందుకొని వరుసగా సినిమాలు చేయాల్సిందే. ఇప్పటికే కొంతమంది దర్శకులతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మించిన దిల్ రాజు ఇప్పుడు దర్శకుడు సతీష్ వేగేశ్న ను వన్స్ మోర్ అంటూ వరుస సినిమాలకు కమిట్ చేయిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘శతమానం భవతి’ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో వెంటనే ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా చేసారు. ఇక లేటెస్ట్ సతీష్ వేగేశ్న తో మరో సినిమా కూడా నిర్మిస్తున్నా అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు దిల్ రాజు.


‘రంగస్థలం’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే… తమ సంస్థకు మర్చిపోలేని రేంజ్ సినిమా అందించిన సుకుమార్ కి వెంటనే మరో ఆఫర్ ఇచ్చి మరో సినిమా చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. ఇప్పటి వరకూ ఒక్కో బ్యానర్ కి ఒక్కో సినిమా చేస్తూ వచ్చిన సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కి మాత్రం వన్స్ మోర్ అంటున్నాడు. ప్రస్తుతం మహేష్ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న సుక్కు త్వరలోనే మైత్రి బ్యానర్ లో ఈ సినిమాను రూపొందించనున్నాడు.


లేటెస్ట్ గా సీ.కే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘ఇంటెలిజెంట్’ సినిమా చేసిన వినాయక్.. సి.కళ్యాణ్ నిర్మాణంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఇంటెలి జెంట్ రిలీజ్ అయిన వెంటనే నెక్స్ట్ సినిమా కూడా వినాయక్ తోనే చేస్తున్నానని అనౌన్స్ చేసాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సో సీ.కే. ఎంటర్టైన్మెంట్స్ తో వినాయక్ వన్స్ మోర్ అనబోతున్నాడన్నమాట.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ‘శ్రీ రస్తు శుభమస్తు’ సినిమా చేసిన పరశురాం (బుజ్జి) మళ్ళీ ఇదే బ్యానర్ లో ‘గీత గోవిందం’ సినిమా చేసాడు. ఈ సినిమా షూటింగ్ టైంనే గీతా ఆర్ట్స్ లో మరో సినిమా కూడా కమిట్ అయ్యాడు ఈ డైరెక్టర్. లేటెస్ట్ గా ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పాడు బుజ్జి. మరి అల్లు శిరీష్ కి ఓ సూపర్ హిట్ ఇచ్చి బ్యానర్ కి మరో సూపర్ హిట్ ఇవ్వబోతున్న దర్శకుడిని ఎవరు వదులుకుంటారు. అందుకే బుజ్జి తో వరుస సినిమాలు చేస్తున్నాడు అల్లు అరవింద్.


కెరీర్ స్టార్టింగ్ లో దర్శకులకు నిర్మాత దొరకడమే గగనం… కానీ అనిల్ రావిపూడికి మాత్రం అది చాలా ఈజీ అయిపొయింది. పటాస్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ప్రతిభ కి ఫిదా అయ్యి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఇప్పటికే దిల్ రాజు బ్యానర్ లో ‘సుప్రీమ్’,’రాజా ది గ్రేట్’ సినిమాలు చేసిన అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేష్ -వరుణ్ తేజ్ లతో కలిసి ఇదే బ్యానర్ లో ‘F2’సినిమా కూడా చేస్తునాడు. స్టఫ్ ఉంటే తప్ప ఆ దర్శకుడితో వరుస సినిమాలు నిర్మించని దిల్ రాజు అనిల్ తో ఇలా వరుస సినిమాలు నిర్మించడం చూస్తే అనిల్ గ్రేట్ అనిపిస్తుంది.


ప్రస్తుతం ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ లో ‘సవ్య సాచి’ సినిమా చేస్తున్నాడు చండూ మొండేటి.. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ఇదే బ్యానర్ లో మరో ఆఫర్ అందుకున్నాడు. బ్యానర్ కి హిట్ ఇస్తే వెంటనే ఆ డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇచ్చే మైత్రి నిర్మాతలు చందూ టేకింగ్ కి ఫిదా అయ్యే ఈ అవకాశం ఇచ్చి ఉండొచ్చు. సో సవ్యసాచి తర్వాత చందూ చేయబోయే సినిమా కూడా మైత్రి లోనే ఉంటుంది.

2014 లో ‘రన్ రాజా రన్’ అంటూ సూపర్ హిట్ కొట్టిన సుజీత్ దాదాపు మూడేళ్ళ పాటు వెయిట్ చేసి మళ్ళీ తన మొదటి సంస్థ అయిన ‘యు.వి.క్రియేషన్స్’ బ్యానర్ లో రెండో సినిమా చేస్తున్నాడు. ఈ కుర్ర డైరెక్టర్ టాలెంట్ కి మెస్మరైజ్ అయిన నిర్మాతలు వంశీ, ప్రమోద్ ప్రస్తుతం సుజీత్ తో దాదాపు 200 కోట్లు పెట్టి ‘సాహో’ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకే ఒక్క సినిమాతో నిర్మాతలను ఇంప్రెస్ చేసి వన్స్ మోర్ అనిపించుకోవడంతో పాటు భారీ బడ్జెట్ సినిమా పట్టేసాడు సుజీత్.


సినిమా నిర్మించడంలో నిర్మాత సురేష్ బాబు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే… ప్రతీ సినిమాకు ఆచి తూచి వ్యవహరించే ఈ బడా నిర్మాత తరుణ్ భాస్కర్ అనే కుర్ర దర్శకుడితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తున్నాడు. ‘పెళ్లి చూపులు’ తర్వాత సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ నగారానికి ఏమైంది’ అనే సినిమా చేసిన తరుణ్ భాస్కర్ నెక్స్ట్ సినిమాను కూడా ఇదే బ్యానర్ లో చేయబోతున్నాడు. ఇటివలే సురేష్ ప్రొడక్షన్ లోనే నెక్స్ట్ సినిమా కూడా చేయబోతున్నానంటూ తరుణ్ ఇచ్చేసాడు తరుణ్.

ఈ ఏడాది వచ్చిన సూపర్ హిట్స్ లో ‘తొలి ప్రేమ’ కూడా ఒకటి. ఈ సినిమాతో హాట్ టాపిక్ గా మారిన వెంకీ అట్లూరి మళ్ళీ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ లోనే అఖిల్ తో సినిమా చేస్తున్నాడు. తమ బ్యానర్ కి ఓ మెమోరబుల్ మూవీ అందించిన వెంకీ కి వెంటనే అడ్వాన్స్ అందించి మరో సినిమా చేస్తున్నాడు నిర్మాత భోగవల్లి ప్రసాద్.