ఈరోజే ‘గీతగోవిందం’ ప్రీ-రిలీజ్ హంగామా

Sunday,August 12,2018 - 11:14 by Z_CLU

ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’ సినిమా. ఇప్పటికే ఆడియో సూపర్ హిట్ అనిపించుకున్న ఈ సినిమా, ఆగష్టు 15 న గ్రాండ్ గా  రిలీజవుతుంది. అయితే రిలీజ్ కి ముందు ఈరోజు  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరుపుకోనుంది సినిమా యూనిట్.

వైజాగ్ లోని ఆంధ్రా యూనివర్సిటీ లో ఈ ఈవెంట్ జరగబోతోంది. ఆడియో రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను రివీల్ చేసిన ఫిలిం మేకర్స్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచనున్నారు.

 

పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి గోపీసుందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటించింది. బన్ని వాసు నిర్మించిన ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు.