జీ సినిమాలు ( 12th ఆగష్టు )

Saturday,August 11,2018 - 10:26 by Z_CLU

భేతాళుడు

నటీనటులు : విజయ్ ఆంటోని, అరుంధతి నాయర్

ఇతర నటీనటులు : Y  . G మహేంద్ర, మీరా కృష్ణన్, కిట్టి, చారు హాసన్, సిద్ధార్థ శంకర్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ ఆంటోని

డైరెక్టర్ : ప్రదీప్ కృష్ణమూర్తి

ప్రొడ్యూసర్ : ఫాతిమా విజయ్ ఆంటోని

రిలీజ్ డేట్ : 1  డిసెంబర్ 2016

సాఫ్ట్ వేర్ కంపెనీ లో సాఫ్ట్ వేర్ గా పనిచేసే దినేష్(విజయ ఆంటోనీ) ఒక అనాధ గా జీవితాన్ని కొనసాగిస్తున్న ఐశ్వర్య(అరుంధతి నాయర్) ను పెళ్లిచేసుకుంటాడు. పెళ్ళైన తరువాత దినేష్ కు భయంకరమైన గొంతు వినపడుతూ వేధిస్తుంది.. గతజన్మ కు సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుకు రావడం. జయలక్ష్మి అనే మహిళ తనను గత జన్మలో చంపిందంటూ గొంతుతో వినబడుతూ ఉంటుంది. ఇంతకీ గొంతు ఎవరిది? ఐశ్వర్య ను పెళ్లి చేసుకున్న తరువాత దినేష్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? అసలు జయలక్ష్మి ఎవరు? గతజన్మలో దినేష్ ఎవరు? అనేది సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

లింగ

నటీనటులు : రజినీకాంత్, అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా

ఇతర నటీనటులు : జగపతి బాబు, K. విశ్వనాథ్, N. సంతానం, కరుణాకరన్, దేవ్ గిల్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్

డైరెక్టర్ : K.S. రవి కుమార్

ప్రొడ్యూసర్ : రాక్ లైన్ వెంకటేష్

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2014

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన డైరెక్ట్ సినిమా ‘లింగ’. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఉండే సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు.  అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.

==============================================================================

మున్నా

నటీనటులు : ప్రభాస్, ఇలియానా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రాహుల్ దేవ్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, పోసాని కృష్ణ మురళి, వేణు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : వంశీ పైడిపల్లి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 2, మే  2007

ప్రభాస్, ఇలియానా జంటగా నటించిన పర్ ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాకి పీటర్ హెయిన్స్ యాక్షన్, హారిస్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

యుగానికి ఒక్కడు

నటీ నటులు : కార్తీ, రీమా సేన్ , ఆండ్రియా

మ్యూజిక్ డైరెక్టర్ : జి.వి.ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : సెల్వ రాఘవన్

ప్రొడ్యూసర్ : ఆర్.రవీంద్రన్

విడుదల : జనవరి 14 , 2010

కార్తీ, రీమా సేన్, ఆండ్రియా లతో దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఎడ్వెంచర్ ఎంటర్టైనర్ చిత్రంయుగానికొక్కడు’. చోళుల సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలనుకొనే అమ్మాయి ఇద్దరి సహాయం తో స్థలాన్ని చివరికీ ఎలా కనిపెట్టింది అనే కధాంశం తో తెరకెక్కిన చిత్రం లో చోళుల సామ్రాజ్యానికి ప్రయాణించే సీన్స్, చోళుల సామ్రాజ్యం లోకి ప్రవేశించే సీన్స్, ప్రవేశించిన తరువాత థ్రిల్లింగ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. చిత్రం లో కార్తీ నటన, రీమా సేన్, ఆండ్రియా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్స్.

==============================================================================

బ్రదర్ అఫ్ బొమ్మాళి

నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్బ్రదర్ అఫ్ బొమ్మాలి’. సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందికోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ  పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

==============================================================================

సికందర్

నటీనటులు : సూర్య, సమంతా రుత్ ప్రభు

ఇతర నటీనటులు : విద్యుత్ జమ్వాల్, సూరి, బ్రహ్మానందం, మనోజ్ బాజ్ పాయ్, దళిప్ తాహిల్, మురళి శర్మ, ఆసిఫ్ బస్రా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : N. లింగుస్వామి

ప్రొడ్యూసర్ : సిద్ధార్థ్ రాయ్ కపూర్, N. సుభాష్ చంద్రబోస్

రిలీజ్ డేట్ : 14 ఆగష్టు 2014

సూర్య హీరోగా నటించిన సికందర్ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్. డ్యూయల్ రోల్ లో నటించిన సూర్య నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. చిన్నప్పుడే తప్పిపోయిన తన అన్నను వెదుక్కుంటూ వచ్చిన తమ్ముడు అప్పటికే తన అన్న సిటీలో పెద్ద డాన్ అని తెలుసుకుని షాక్ కి గురి అవుతాడు. తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రధాన కథాంశం. సినిమాలో సూర్య సరసన సమంతా హీరోయిన్ గా నటించింది.