'V' టైటిల్ సీక్రెట్ ఇదే ?

Wednesday,February 19,2020 - 12:05 by Z_CLU

నాని , సుదీర్ బాబు కాంబినేషన్ లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాకు ‘V’ అనే టైటిల్ అనౌన్స్ చేయగానే ఇదేం టైటిల్ ? ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటని అందరూ అనుకున్నారు. అయితే ఈ టైటిల్ ఫిక్స్ చేసే ముందు  కొన్ని టైటిల్స్ అనుకున్నారు మేకర్స్. కానీ ఫైనల్ గా ‘V’ కే ఫిక్సయ్యారు. దీనికి ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంది.

సినిమాలో నాని పేరు విక్రమ్ ఆదిత్య అని సమాచారం. సినిమాలో కథంతా నాని క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి అతని పేరులో ముందుగా వచ్చే ‘V’ అక్షరాన్ని టైటిల్ గా పెట్టారు. ఇక సినిమాలో విక్రమ్ చేసే క్రైం వెనుక ఓ ‘కీ’ కూడా ఉంటుందట. అన్నిటికి ‘V’అనే క్లూ ఇస్తాడని తెలుస్తుంది. ఆ ‘కీ’ ను కనిపెట్టి నానిను పట్టుకోవాలని చూస్తాడట సుదీర్ బాబు. అందుకే ఈ రీజన్స్ తో కథకి కనెక్షన్ ఉన్న టైటిల్ నే పెట్టుకున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై రాజు , శిరీష్ , హర్షిత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది , తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మార్చ్ 25న సినిమా థియేటర్స్ లోకి రానుంది.