అఫీషియల్ : తారక్ తో త్రివిక్రమ్

Wednesday,February 19,2020 - 05:22 by Z_CLU

ఎన్టీఆర్ తో మళ్ళీ త్రివిక్రమ్ సినిమా అనే వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ సినిమాను అఫీషియల్ అనౌన్స్ చేశారు. ‘అల వైకుంఠపురములో’ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన త్రివిక్రమ్ తారక్ 30వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది.  వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయబోతున్నారు.

ఈ కాంబినేషన్ సినిమాను హారికా & హాసినీ క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చినబాబు , కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నాడు. త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటిస్తారు. ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్స్ ను ఫైనల్ చేయాల్సి ఉంది.