అప్పుడు రామ్ ...ఇప్పుడు విజయ్ !

Wednesday,February 19,2020 - 11:45 by Z_CLU

అప్పటి వరకూ లవర్ బాయ్ గా కనిపించిన రామ్ ఉన్నపళంగా మాస్ అవతార్ లో కనిపిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఆ ఊహ కూడా ఎవరికీ రాలేదు. కానీ రామ్ ను ‘ఇస్మార్ట్ శంకర్’ గా మార్చి అందరినీ సప్రయిజ్ చేసాడు పూరి. లాంచ్ రోజే రామ్ లుక్ ను రివీల్ చేసి షాక్ ఇచ్చాడు.

గతంలో ఆ హీరో ఎలా కనిపించాడో అన్నది పక్కన పెట్టి తను ఎలా చూపించాలనుకుంటున్నాడో కంప్లీట్ గా అదే ఫాలో అవుతాడు పూరి. ఇప్పుడు విజయ్ దేవరకొండ లుక్ విషయంలోనూ అదే రిపీట్ చేయబోతున్నాడు. సినిమాలో విజయ్ ను ఓ మాస్ హీరోగా పవర్ ఫుల్ లుక్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు పూరి. దీని కోసం విజయ్ ను చాలా కష్టపెడుతున్నాడు. షూటింగ్ చేస్తూనే మరో వైపు తన ఫిజిక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ వర్కౌట్ చేస్తున్నాడు రౌడీ.

సినిమాలో విజయ్ కొత్త లుక్ ను మే 9న అతని పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ టీజర్ తో చూపించి సప్రయిజ్ చేయనున్నాడు పూరి. ఇప్పటికే ఈ విషయాన్ని విజయ్ కన్ఫర్మ్ చేసాడు కూడా. మూడు నెలల్లో తన లుక్ చూసి షాక్ అవుతారని చెప్పాడు. సో పూరి హీరోగా విజయ్ ఎలా కనిపిస్తాడో తెలియాలంటే మే9 వరకూ వెయిట్ చేయాల్సిందే.