చైతూ-సమంత సినిమాకు టైటిల్ ఫిక్స్ ?

Sunday,March 04,2018 - 02:36 by Z_CLU

ప్రస్తుతం నాగ చైతన్య -సమంత కలిసి ఓ సినిమా చేయబోతున్నారన్న సంగతి తెల్సిందే..  వీరిద్దరి నుంచి ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు కాని ఆల్మోస్ట్ ఈ సినిమా కన్ఫర్మ్స్ అనే వార్త వినిపిస్తుంది. ‘నిన్ను కోరి’ ఫేం శివ నిర్వాన డైరెక్షన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకు లేటెస్ట్ గా ‘ప్రేయసి’ అనే టైటిల్ ఫిక్స్ చేసారని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు శివ. నిన్ను కోరి సక్సెస్ తర్వాత శివ డైరెక్ట్ చేస్తున్న సినిమా, పైగా పెళ్లి తర్వాత చైతూ-సమంత కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.  త్వరలోనే  ఈ సినిమాకు సంబంధించి  అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.