'రంగస్థలం' నుండి మరో సాంగ్ రెడీ

Sunday,March 04,2018 - 12:20 by Z_CLU

సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ నటిస్తున్న ‘రంగస్థలం’ నుండి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. మొన్నామధ్య విడుదలైన ‘ఎంత సక్కగున్నవే’ పాట ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. లేటెస్ట్ గా ఈ సినిమాలోని రెండు పాటను కూడా విడుదల చేసారు . ‘రంగా రంగా రంగాస్తలనా’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది.

ప్రస్తుతం ఈ రెండు పాటలకు వస్తున్న రెస్పాన్స్ తో మరో పాటను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ‘రంగమ్మ-మంగమ్మ’ అంటూ సాగే ఈ పాటను వచ్చే వారం విడుదల చేయనున్నారు. మిగతా పాటలను ఈ నెల 18 న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేయనున్నారని సమాచారం.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై 1985 లో జరిగే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా చంద్ర బోస్ సింగిల్ కార్డ్ సాహిత్యం అందించాడు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈనెల 30 థియేటర్స్ లోకి రానుంది.