మళ్ళీ రిపీట్ చేయబోతున్న నాని !

Tuesday,February 25,2020 - 02:00 by Z_CLU

రెండేళ్ళ క్రితం వరకూ ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ వచ్చాడు నాని. గతేడాది మాత్రం ‘జెర్సీ’,’గ్యాంగ్ లీడర్’ సినిమాలు మాత్రమే చేసాడు. ఇకపై నాని ఏడాదికి రెండు సినిమాలు మాత్రం ప్లాన్ చేసుకుంటున్నాడా అనే డైలమాలో పడ్డారు ఫ్యాన్స్. అయితే అలాంటిదేం లేదంటూ వరుస సినిమాలతో క్లారిటీ ఇచ్చేసాడు నాని.

వచ్చే నెల 25 న ‘V’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాని శివ నిర్వాణ డైరెక్షన్ లో చేస్తున్న ‘టక్ జగదీష్’ ను జులైలో రిలీజ్ చేయాలని ఫిక్సయ్యాడు. ఇక రాహుల్ సంక్రిత్యన్ తో అనౌన్స్ అయిన ‘ శ్యాం సింగ రాయ్’ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు.

తాజాగా టైటిల్ తో పాటే రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసి ఈ ఏడాది తన నుండి మూడు సినిమాలు పక్కా అంటూ చెప్పేశాడు. గతేడాది రెండు సినిమాలతో సరిపెట్టుకున్న నేచురల్ స్టార్ మళ్ళీ మునుపటిలా మూడు సినిమాలతో హంగామా చేయబోతున్నాడన్నమాట.