Sai Tej Vaishnav Tej - వారం గ్యాప్ లో పోటీ
Saturday,October 02,2021 - 05:00 by Z_CLU
ప్రస్తుతం ‘రిపబ్లిక్‘ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు సాయి తేజ్. ఈ సినిమాకి సరిగ్గా వారం గ్యాప్ లో అంటే అక్టోబర్ 8 వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం‘ రిలీజ్ అవుతుంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా థియేటర్స్ ఇష్యూ కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు థియేటర్స్ లోకి రాబోతుంది. అయితే సరిగ్గా వారం గ్యాప్ లో మెగా బ్రదర్స్ థియేటర్స్ లో సందడి చేయడం ఇదే మొదటి సారి.
అన్నయ్య సినిమా ఆడుతుండగానే పక్క థియేటర్ లో తన సినిమాతో ప్రత్యేక్షమవ్వనున్నాడు వైష్ణవ్ తేజ్. నిజానికి ఒకే నెలలో ఇలా సాయితేజ్–వైష్ణవ్ తేజ్ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ కూడా సంబర పడుతున్నారు. వైష్ణవ్ తేజ్ ‘రిపబ్లిక్’ సినిమా చూసేసిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ‘కొండపొలం’ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అదే టైటిల్ తో వచ్చిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు క్రిష్.

ఇప్పటీ టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ నుండి వస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. వైజాగ్ , కర్నూల్ ఇలా కొన్ని ఊర్లు పర్యటించి సినిమాను జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
మరి ఈ రెండు సినిమాలతో మెగా బ్రదర్స్ బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేస్తారో చూడాలి.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics