RRR Movie - కొత్త రిలీజ్ డేట్ ఇదే

Saturday,October 02,2021 - 06:47 by Z_CLU

RRR Movie to release on January 7

సస్పెన్స్ వీడింది. ఊహాగానాలే నిజమయ్యాయి. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. అందరూ ఊహించినట్టుగానే ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపారు. జనవరి 7న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకాబోతున్నట్టు స్వయంగా దర్శకుడు రాజమౌళి ప్రకటించాడు.

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలతో పాటు.. ఒకేసారి 15 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులతో సంప్రదింపులు జరిగిన తర్వాత విడుదల తేదీ ఫిక్స్ చేశారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో పెన్ స్టుడియోస్ తో చర్చలు జరిపి ఈ తేదీని లాక్ చేశారు.

RRR movie

గమ్మత్తైన విషయం ఏంటంటే.. అలియాభట్ నటించిన గంగూబాయి కతియావాడి అనే హిందీ సినిమా సరిగ్గా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు 24 గంటల ముందు రిలీజ్ అవుతోంది. అది కూడా హిందీతో పాటు తెలుగులో రిలీజ్ అవుతోంది. సంజయ్ లీలా భన్సాలీ దీనికి దర్శకుడు. అలా తన సినిమాతో తానే పోటీపడబోతోంది అలియా భట్.

లెక్కప్రకారం, ఈనెల 13న థియేటర్లలోకి రావాలి ఆర్ఆర్ఆర్ మూవీ. కానీ, అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తికాకపోవడంతో విడుదలను వాయిదా వేశారు. అలా పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేస్తారని అనుకున్నప్పటికీ, అంతకంటే ముందే సంక్రాంతి బరిలో నిలిపారు.

ఆర్ఆర్ఆర్ రాకతో సంక్రాంతి రిలీజుల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భీమ్లానాయక్, సర్కారువారి పాట, రాధేశ్యామ్ సినిమాల్ని సంక్రాంతికి ఎనౌన్స్ చేశారు. వీటిలో సర్కారువారి పాట సినిమా సమ్మర్ కు వాయిదా పడే అవకాశాలున్నాయి. ఇక రాధేశ్యామ్, భీమ్లా నాయక్ లో ఏదో ఒకటి పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics