Raviteja Trinadha Rao Movie - హీరోయిన్ ఫిక్స్!

Saturday,October 02,2021 - 04:09 by Z_CLU

త్వరలోనే ఖిలాడి సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం శరత్ మండవ డైరెక్షన్ లో ‘రామరావు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటే మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు రవితేజ. నెక్స్ట్ త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. #RT69 గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ అయింది.

raviteja trinadharao nakkina

ఇప్పటికే కాస్టింగ్ ఫైనల్ చేసేశారు. రవితేజ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటించబోతుంది. తెలుగులో ‘పెళ్లి సందD’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అవ్వనున్న ఈ కన్నడ బ్యూటీకి ఇది రెండో సినిమా. రెండో సినిమాకే రవితేజ సినిమా ఆఫర్ అందుకుంది.

ఇక సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. రవితేజ డ్యుయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ కి అవకాశం ఉంటుందా ? లేదా శ్రీలీల మాత్రమే హీరోయిన్ గా కనిపిస్తుందా ? తెలియాల్సి ఉంది.

సోమవారం నుండి హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. 10 రోజుల పాటు షెడ్యుల్ జరగనుంది. ఈ మేరకు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ వేశారు. అందులోనే కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్ పై TG విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ-మాటలు అందిస్తున్నాడు. రవితేజతో బెంగాల్ టైగర్ సినిమాకు వర్క్ చేసిన భీమ్స్ సేసిరోలియో ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics