కొత్త మహేష్ ని చూస్తారు -సూపర్ స్టార్

Thursday,January 09,2020 - 05:58 by Z_CLU

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేసిన మహేష్ రెండు రోజుల్లో ఈ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సందర్భంగా సరిలేరు ముచ్చట్లను మీడియాతో పంచుకున్నాడు. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎలా కుదిరిందనే విషయాన్ని తెలియజేసాడు. ” ‘F2’ సమయంలోనే అనిల్ ‘సరిలేరు నీకెవ్వరు’ కథను ఓ నలబై నిమిషాల చెప్పాడు. అయితే ఆ టైంలో ఇద్దరికీ చెరో సినిమా ఉంది కానీ ‘F2’రిలీజ్ తర్వాత సొంతంగా డిసిషన్ తీసుకొని మరీ అనిల్ ను ముందు చేయడం ఏమైనా కుదురుతుందా..? అని అడిగాను. అనిల్ వెంటనే హ్యాపీ గా ఒకే చెప్పేసి మూడు నెలల్లో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకొచ్చాడు. నా కెరీర్ లోనే ఇది బెస్ట్ డిసిషన్ అనుకుంటున్నాను” అంటూ చెప్పుకున్నాడు సూపర్ స్టార్.

ఇక సినిమాలో కొత్త మహేష్ ని చూస్తారని అన్నాడు. ‘శ్రీమంతుడు’ నుండి ‘మహర్షి’ వరకూ చేసిన సినిమాలన్నీ ఓ సందేశంతో కూడినవని వాటి నుండి బయటికొచ్చి నేను చేసిన పక్కా ఎంటర్టైన్ మెంట్ సినిమా అని తెలిపాడు. ఇక అనిల్ ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒకెత్తు అయితే సరిలేరు నీకెవ్వరు’ మరో ఎత్తంటూ తన కాన్ఫిడెన్స్ ను వ్యక్తపరిచాడు.