జాను టీజర్.. జెన్యూన్ రీమేక్

Thursday,January 09,2020 - 06:10 by Z_CLU

తమిళ్ లో కల్ట్ ప్రేమకథాచిత్రంగా పేరుతెచ్చుకున్న 96 సినిమా చూసిన వాళ్లకు, ఆ సినిమాను అమితంగా ఆరాధించేవాళ్లకు ఆ సినిమా రీమేక్ గా వస్తున్న జాను టీజర్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే, ఫీల్ ఏమాత్రం
చెడకుండా.. ఎమోషన్ మిస్ అవ్వకుండా ఉంది జాను టీజర్.

సినిమాలో హీరోయిన్ సమంత పేరు జాను. సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. అందుకే సినిమాకు జాను అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఒరిజినల్ వెర్షన్ లో ఈ క్యారెక్టర్ కు త్రిష ప్రాణంపోసింది. ఇప్పుడు సమంత కూడా దాదాపు ఆ మేజిక్ ను రిపీట్ చేసేలా ఉంది.

ఇక విజయ్ సేతుపతి పోషించిన రాము పాత్రలో శర్వానంద్ నటించాడు. ఒరిజినల్ చూసిన వాళ్లకు శర్వా స్థానంలో విజయ్ సేతుపతి గుర్తొచ్చినప్పటికీ, తనదైన స్టయిల్ చూపించాడు శర్వానంద్. ఒరిజినల్ వెర్షన్ ను డైరక్ట్ చేసిన ప్రేమ్ కుమార్, రీమేక్ ను కూడా హ్యాండిల్ చేయడంతో ఎక్కడా ఫీల్ చెడిపోలేదు.

దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరిలో థియేటర్లలోకొస్తోంది జాను.