అడవి రాముడు కథ ఇదే

Sunday,June 24,2018 - 12:40 by Z_CLU

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హాథీ మేరీ సాథీ అనే సినిమా చేస్తున్నాడు రానా. ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా మలేషియా అడవుల్లో భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. తెలుగులో ఈ సినిమా అడవి రాముడు పేరిట విడుదలకానుంది. తాజాగా  ఈ సినిమా స్టోరీలైన్ రివీల్ అయింది.

కొన్నేళ్ల క్రితం అస్సాంలో జరిగిన కొన్ని సంఘటనల్ని బేస్ చేసుకొని ఈ సినిమా కథ రాసుకున్నాడట దర్శకుడు ప్రభు సాల్మన్. అస్సాంలోని అటవీ ప్రాంతంలో మనుషులు, జంతువుల మధ్య జరిగిన పోరాటం దీనికి మూలకథ. ఆ పోరాటంలో దాదాపు 20 ఏనుగులు తమ ఉనికి కోల్పోయాయి.

అస్సాంలోని కజరంగా ప్రాంతంలో అడవులు నరికివేయడం వల్ల అలా ఆశ్రయం కోల్పోయిన ఏనుగుల్ని హీరో ఎలా కాపాడాడు అనేది సినిమా బేసిక్ స్టోరీ. దీనికి ఇంట్రెస్టింగ్ ఫిక్షన్ యాడ్ చేసి సినిమాను తెరకెక్కిస్తున్నారు.