ఎన్టీఆర్ కు తండ్రిగా నాగబాబు

Sunday,June 24,2018 - 01:45 by Z_CLU

క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు నాగబాబు. ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఇప్పుడీ నటుడు మరో కాంబినేషన్ షురూ అయ్యాడు. అదే ఎన్టీఆర్-నాగబాబు కాంబో. నిజానికి ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తేం కాదు. కానీ ఎన్టీఆర్ కు తండ్రిగా నాగబాబు నటించడం మాత్రం కచ్చితంగా కొత్తే.

అవును.. అరవింద సమేత చిత్రంలో యంగ్ టైగర్ కు తండ్రిగా కనిపించబోతున్నాడట నాగబాబు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగబాబు పాత్ర చాలా పెద్దదని, సినిమాకు ఎంతో కీలకమైనది టాక్. ఎన్టీఆర్-నాగబాబు మధ్య ఎమోషనల్ సీన్స్ ఉంటాయట.

హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకుడు.