Teja’s ‘Vikramaditya’ movie details here
తేజ తన పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకులకు రెండు ప్రీ లుక్ పోస్టర్స్ తో అప్డేట్స్ ఇచ్చాడు. అందులో ఒకటి సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరాం హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అహింస’ ప్రీ లుక్ పోస్టర్. ఇంకొకటి ‘విక్రమాదిత్య’ ప్రీ లుక్ పోస్టర్. అయితే ‘అహింస’ కి సంబంధించి దగ్గుబాటి ఫ్యామిలీ నుండి అభిరామ్ హీరోగా లాంచ్ అవుతున్నాడన్న సంగతి తెలిసిందే. కానీ ‘విక్రమాదిత్య’ సినిమా హీరో ఎవరనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంచాడు తేజ.
తాజాగా అందిన సమాచారం మేరకూ అమితవ్ తేజ ఈ సినిమాకి హీరో . అమితవ్ తేజ ఎవరో కాదు దర్శకుడు తేజ కొడుకు. ఎప్పటి నుండి తేజ తన కొడుకుని హీరోగా లాంచ్ చేయనున్నాడనే న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఎట్టకేలకు ఇప్పుడు తన కొడుకుతో సినిమా చేస్తున్నాడట తేజ. ‘విక్రమాదిత్య’ పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనుంది. ఈ కథ మీద చాలా వర్క్ చేసి నేడు షూటింగ్ మొదలు పెట్టాడు తేజ.

తన కొడుకు సినిమా కోసం మంచి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు సీనియర్ డైరెక్టర్. 22-2-22 డేట్ ఒక్కటే కాదు సరిగ్గా 2 గం 22 నిమిషాలకు ముహూర్తం షాట్ చేశాడు. నిజానికి ఈ డేట్ తేజ కి సెంటిమెంట్ కూడా. ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజు నితిన్ ‘జయం’ సినిమా మొదలు పెట్టాడు తేజ. చాలా మంది కొత్తవాళ్ళను పరిచయం చేస్తూ తేజ తీసిన ఆ సినిమా ఏ రేంజ్ హిట్టయిందో అందరికీ తెలిసిందే. అందుకే తన కొడుకు సినిమా లాంచ్ కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమాను లక్ష్మి నరసింహా ప్రొడక్షన్ బేనర్ పై నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics