Sharwanand కొరియోగ్రాఫర్ తో శర్వా సినిమా !

Tuesday,February 22,2022 - 06:29 by Z_CLU

హీరో శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాలతో త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత శర్వా ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా ? అనే డౌట్ కి త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నాడు. కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకుడిగా ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు శర్వా. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది.

చాన్నాళ్లుగా రాజు సుందరం మెగా ఫోన్ పట్టి డైరెక్టర్ అవ్వాలని చూస్తున్నాడు. ప్రభు దేవ, లారెన్స్ దారిలోనే తను కూడా డాన్స్ మాస్టర్ నుండి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అవ్వాలని భావిస్తున్నాడు. ఇటివలే శర్వాకి స్క్రిప్ట్ చెప్పి లాక్ చేసేసుకున్నాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించాబోతుంది. ఈ బేనర్ లో శర్వా ఇప్పటికే మూడు సినిమాలు చేశాడు. ఒకరకంగా ఇది శర్వాకి ఓన్ బేనర్ అని చెప్పొచ్చు.

ప్రస్తుతం శర్వాకి హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. మిగతా కాస్టింగ్ ని కూడా ఫిక్స్ చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఎనౌన్స్ మెంట్ రానుంది. ఏప్రిల్ లేదా మే నుండి షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics