Radheshyam ప్రభాస్ కోసం అమితాబ్

Tuesday,February 22,2022 - 01:04 by Z_CLU

ఈ మధ్య బడా సినిమాలకు సంబంధించి లెజెండ్స్ వాయిస్ ఓవర్ అనేది కామన్ అయిపోయింది. చిన్న సినిమాలు కూడా ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కి కూడా ఓ లెజండరీ యాక్టర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. అవును ప్రభాస్ సినిమా బిగ్ బి అమితాబ్ వాయిస్ తో మొదలు కానుంది.

‘రాధే శ్యామ్’ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్  పూర్తయింది. ఫస్ట్ కాపీ రెడీ చేసి సెన్సార్ కి పంపించే పనిలో ఉన్నారు మేకర్స్. అయితే ఈ సినిమాకు అమితాబ్ వాయిస్ ఓవర్ ఇస్తే సినిమా ఎలివేట్ అవుతుందని భావించారట మేకర్స్. ఈ విషయన్ని ప్రభాస్ కి చెప్పి అమితాబ్ కి రీచ్ చేశారట.

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ తో కలిసి  ‘ప్రాజెక్ట్  కే’ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇటివలే ఈ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ షూట్ చేశారు. ఆ సందర్భంలోనే అభిమాన హీరోని తన సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వమని అడిగాడట ప్రభాస్. బాహుబలి అడిగే సరికి వెంటనే ఒకే చెప్పేసి ఒక డేట్ కూడా చెప్పేశాడట అమితాబ్. అయితే అమితాబ్ అన్ని భాషల్లోనూ వాయిస్ చెప్తారా ? లేదా తనకి కన్వినెంట్ అయిన హిందీలో మాత్రమే చెప్తారా అనేది తెలియాల్సి ఉంది. అమితాబ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన  విషయన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి తెలియజేశారు మేకర్స్. త్వరలోనే సినిమాకు సంబంధించి భారీ ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics