టాక్సీవాలా ఫస్ట్ వీక్ వసూళ్లు

Monday,November 26,2018 - 12:10 by Z_CLU

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గీతగోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ హీరో, తాజాగా టాక్సీవాలాతో మరోసారి బ్లాక్ బస్టర్ రిపీట్ చేశాడు. రాహుల్ దర్శకత్వంలో విజయ్ నటించిన టాక్సీవాలా సినిమా ఫస్ట్ వీక్ లో దుమ్ముదులిపింది.

మొదటి రోజే కళ్లుచెదిరే ఓపెనింగ్స్ తో 10 కోట్ల గ్రాస్ తో బ్రేక్-ఈవెన్ అందుకున్న ఈ సినిమా, వారం తిరిగే సరికి అన్ని ఏరియాస్ లో ఎగ్జిబిటర్లకు లాభాలు అందించింది. వరల్డ్ వైడ్ 15 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ సాధించింది టాక్సీవాలా సినిమా. ఏపీ, నైజాంలో టాక్సీవాలా 7 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి

ఏపీ, నైజాం ఫస్ట్ వీక్ షేర్
నైజాం – రూ. 6.30 కోట్లు
సీడెడ్ – రూ. 1.35 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.47 కోట్లు
ఈస్ట్ – రూ. 75 లక్షలు
వెస్ట్ – రూ. 66 లక్షలు
గుంటూరు – రూ. 89 లక్షలు
కృష్ణా – రూ. 88 లక్షలు
నెల్లూరు – రూ. 32 లక్షలు