మహేష్ అభిమానుల్లో 'అతి పెద్ద' ఫ్యాన్

Monday,November 26,2018 - 12:16 by Z_CLU

మహేష్ కు కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. కానీ వాళ్లలో వెరీవెరీ స్పెషల్ ఫ్యాన్ మాత్రం ఒకరున్నారు. ఆమె పేరు రేలంగి సత్యవతి. ఆమె ఎందుకు అంత ప్రత్యేకమో ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్.. మహేష్ అభిమానుల్లో అతిపెద్ద వయష్కురాలు ఈమె. రాజమండ్రికి చెందిన ఈమె వయసు అక్షరాలా 106 సంవత్సరాలు

తనకు ఇంత పెద్ద వయసున్న అభిమాని ఉన్నారనే విషయం మహేష్ కూడా తెలియదు. తన ఫ్యాన్స్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మహేష్ ఆమెను ప్రత్యేకంగా కలిశాడు. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో మహర్షి సినిమా షూటింగ్ గ్యాప్ లో సత్యవతిని కలిశాడు మహేష్.

మహేష్ ను చూసిన సత్యవతి ఆనందం పట్టలేకపోయింది. మహేష్ చేతులు పట్టుకొని అలానే కూర్చుండిపోయింది. ఇంతకీ ఈమెను మహేష్ ప్రత్యేకంగా ఎందుకు కలిశాడో తెలుసా? మహేష్ ను కలిసి, అతడితో ఒక్కసారి మాట్లాడాలనేది ఈ పెద్దావిడ చిరకాల కోరిక. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.