ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే కాస్ట్ లీ సాంగ్

Monday,November 26,2018 - 11:41 by Z_CLU

భారతీయ సినీచరిత్రలో భారీ బడ్జెట్ చిత్రంగా ఇప్పటికే రికార్డు సృష్టించింది 2.0 సినిమా. ఇప్పుడీ సినిమా మరో రికార్డు కూడా క్రియేట్ చేసింది. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే కాస్ట్ లీ సాంగ్ గా 2.0కు చెందిన ఓ పాట రికార్డు సృష్టించింది.

యంత్రలోకపు సుందరివే అనే ఈ పాట ఇప్పుడు కాస్ట్ లీ సాంగ్ గా చరిత్ర సృష్టించింది. ఈ పాట కోసం అచ్చంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. కేవలం ఈ ఒక్క సాంగ్ కోసమే 4 భారీ సెట్స్ వేసి, రజనీకాంత్-ఎమీ జాక్సన్ పై 10 రోజుల పాటు ఈ సాంగ్ షూట్ చేశారట.

రెహ్మాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇప్పటికే పెద్ద హిట్ అయింది. ఇకపై సిల్వర్ స్క్రీన్ పై కూడా ఈ పాట కళ్లుచెదిరే రీతిలో కనువిందు చేయబోతోందన్నమాట. 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో శంకర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.