ప్రయోగాత్మక పాత్రలో తమన్న

Saturday,April 15,2017 - 01:34 by Z_CLU

ఇకపై వెయిట్  ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని ప్రకటించింది సమంత. అన్నట్టుగానే ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ మాత్రమే సెలక్ట్ చేసుకుంటోంది. సమంతలా పైకి చెప్పకపోయినప్పటికీ తమన్న కూడా ఇప్పుడు అదే బాటలో ఉంది. తను కూడా ప్రయోగాలకు సై అంటోంది. పవర్ ఫుల్ పాత్రలు ఏమైనా ఉంటే చేయడానికి రెడీ అంటోంది. ఇందులో భాగంగా ఓ ఎక్స్ పెరిమెంటల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మిల్కీబ్యూటీ.

హిందీలో త్వరలోనే వసు భగ్నానీ నిర్మాణంలో ఓ సినిమా చేయనుంది తమన్న. ఇందులో ఆమెది వెరీ వెరీ స్పెషల్ క్యారెక్టర్. అవును… మూగ మరియు చెవిటి పాత్రలో తమన్న కనిపించబోతోంది. ఈ పాత్ర కోసం ఇప్పటికే హోం వర్క్ కూడా స్టార్ట్ చేశానని చెప్పుకొచ్చిన తమన్న.. బాహుబలి-2 విడుదల తర్వాత మరిన్ని డీటెయిల్స్ ఎనౌన్స్ చేస్తానంటోంది

బాహుబలి ప్రాజెక్టే తనను మార్చిందని చెప్పుకొచ్చింది మిల్కీబ్యూటీ. అందులో తనుచేసిన మిత్రవింద పాత్రకు మంచి పేరు వచ్చిందని, అలాంటి ప్రయోగాలు భవిష్యత్తులో కూడా చేయాలని చాలామంది అడుగుతున్నారని.. అందుకే ఇకపై క్యారెక్టర్ కు వెయిట్ ఉండే పాత్రలు మాత్రమే చేస్తానని అంటోంది తమన్న.