సుకుమార్ "దర్శకుడు" ఎలా ఉన్నాడో తెలుసా..?

Saturday,April 15,2017 - 02:44 by Z_CLU

దర్శకుడు సుకుమార్ నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంగా కుమారి 21-ఎఫ్ లాంటి సూపర్ సెన్సేషనల్ మూవీని నిర్మించిన సుకుమార్.. ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంతో రెడీ అయ్యాడు. ఆ సినిమా పేరు దర్శకుడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు హరిప్రసాద్ దర్శకత్వం వహించాడు. గతంలో సుకుమార్ దగ్గరే అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశాడు హరిప్రసాద్. పరిశ్రమలో దర్శకుడిగా ఎదగాలంటే ఎంత కష్టపడాలి.. దర్శకుడిగా మారే క్రమంలో ఎలాంటి కష్టాలు పడాలి లాంటి అంశాల్ని ఇందులో చూపించబోతున్నారు. గతంలో ఇదే కాన్సెప్ట్ తో రవితేజ హీరోగా నేనింతే సినిమా వచ్చింది. అయితే దర్శకుడు ప్రాజెక్టులో మాత్రం ఇంకాస్త లోతుగా చర్చించబోతున్నారట.

అశోక్, ఈషా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో అసిస్టెంట్ డైరక్టర్ల స్ట్రగుల్ ను చూపించబోతున్నారు. ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత సినిమాకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి.