Andhadhun Remake - తమన్న సెట్ అవుతుందా?

Monday,September 21,2020 - 01:07 by Z_CLU

Nithin తన సొంత బ్యానర్ లో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘Andhadhun’ ను రీమేక్ చేస్తాడనే వార్తలు వచ్చినప్పటి నుండి రీమేక్ లో Tabu రోల్ ఎవరు చేస్తారా అనే ఆసక్తి నెలకొంది. మొన్నటి వరకు సినిమాలో కీలకమైన ఆ రోల్ కి Anasuya, Shriya, Nayanthara పేర్లు వినిపించగా తాజాగా మేకర్స్ ఆ పాత్రకు Tamannaah ను తీసుకున్నట్లు ప్రకటించారు.

దీంతో సోషల్ మీడియాలో టబు చేసిన పాత్రలో తమన్నా సూటవుతుందా అనే డిస్కషన్ మొదలైంది.

Andhadhun లో అయుష్మాన్ ఖురానా తర్వాత సినిమాకు హైలైట్ గా నిలిచిన టబు రోల్ కి తమన్నా సూట్ అవ్వదేమో అనే డౌట్స్ రేజ్ చేస్తున్నారు కొంతమంది. మరికొంతమంది మాత్రం మిల్కీబ్యూటీ పెర్ ఫెక్ట్ గా సెట్ అవుతుందని వాదిస్తున్నారు.

సినిమా సెట్స్ పైకి వెళ్లి, టీజర్ లాంటిది బయటకొస్తే తప్ప దీనిపై క్లారిటీ రాదు. అప్పటి వరకు ఈ రీమేక్ గురించి, తమన్నా రోల్ గురించి ఈ డౌట్స్ ఇలా రౌండ్స్ కొడుతూనే ఉంటాయి.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. నితిన్ సరసన Nabha Natesh హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ మహతి మ్యూజిక్ ఇస్తున్నాడు.