విలన్ గా మారిన మిల్కీబ్యూటీ

Saturday,September 19,2020 - 02:40 by Z_CLU

Tamannaah to reprise Tabu’s role in Andhadhun Remake

ఎట్టకేలకు నితిన్ సినిమా హీరోయిన్ సెలక్షన్ ఓ కొలిక్కి వచ్చింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ చేయబోయే అంధాధూన్ (Andhadhun) రీమేక్ లో కీలక పాత్ర కోసం చాలామంది హీరోయిన్లను ట్రై చేసి ఫైనల్ గా తమన్నను ఫిక్స్ చేశారు.

హిందీలో ఈ నెగెటివ్ పాత్రను టబు పోషించింది. ఇప్పుడీ పాత్రను తెలుగులో తమన్న చేయబోతోంది. కెరీర్ లో Tamanna చేస్తున్న తొలి నెగెటివ్ క్యారెక్టర్ (Negative Role) ఇదే.

ఈ పాత్ర కోసం టబు, అనసూయ, నయనతార, రమ్యకృష్ణ.. ఇలా చాలామందిని అనుకున్నారు. ఫైనల్ గా ఈ ఛాలెంజ్ ను తమన్న యాక్సెప్ట్ చేసింది.

తమన్న సెలక్షన్ తో సినిమాకు హీరోయిన్ ఎంపిక పూర్తయింది. ఓ హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకున్నారు. హిందీలో రాధిక ఆప్టే పోషించిన పాత్రలో నభా కనిపించనుంది.

Nithin సొంత బ్యానర్ Sreshth Movies పై ఈ సినిమా రాబోతోంది. ఠాగూర్ మధు నిర్మాత. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. నవంబర్ నుంచి సినిమా సెట్స్ పైకి వస్తుంది.