కొత్త సినిమా ప్రకటించిన కార్తికేయ

Monday,September 21,2020 - 04:35 by Z_CLU

కార్తికేయ హీరోగా నూతన దర్శకుడు శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతోంది. తాన్య రవిచంద్రన్ ఇందులో హీరోయిన్. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈరోజు కార్తికేయ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను వెల్లడించారు.

దర్శకనిర్మాతలు శ్రీ సరిపల్లి, రామారెడ్డి మాట్లాడుతూ, “ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ, ఇందులో కార్తికేయ NIA ఆఫీసర్ గా కనిపిస్తారు. కథ వినగానే వెంటనే ఓకే చేసేసారు కార్తికేయ. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం” అని తెలిపారు.

నటీనటులు – కార్తికేయ, తాన్య రవిచంద్రన్, సాయికుమార్, తనికెళ్ళ భరణి, సుధాకర్ కోమాకుల, పశుపతి
రచన – దర్శకత్వం: శ్రీ సరిపల్లి
సంగీతం: ప్రశాంత్.ఆర్.విహారి
ఛాయాగ్రహణం: పి.సి.మౌళి
నిర్మాత: 88 రామారెడ్డి
బ్యానర్: శ్రీ చిత్ర మూవీ మేకర్స్