జీ సినిమాలు ( 19th జూలై )

Wednesday,July 18,2018 - 10:03 by Z_CLU

ఒక్కడొచ్చాడు

నటీనటులు : విశాల్తమన్నా

ఇతర నటీనటులు : వడివేలుజగపతి బాబుసూరితరుణ్ అరోరాజయప్రకాష్నిరోషా మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా

డైరెక్టర్ సూరజ్

ప్రొడ్యూసర్ : S. నంద గోపాల్

రిలీజ్ డేట్ : 23 డిసెంబర్ 2016

డీజీపీ చంద్రబోస్ (జగపతిబాబు) ఒక ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. అతను దేవా (సంపత్) నుండి 50 కోట్ల డబ్బు రికవర్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే సిటీకి వచ్చిన అర్జున్ (విశాల్) దివ్య (తమన్నా) ని ప్రేమిస్తాడు. డీజీపీ చంద్రబోస్ చెల్లి అయిన దివ్య కూడా అతని బ్యాక్ గ్రౌండ్ ఏం తెలుసుకోకుండానే అతనితో లవ్ లో పడిపోతుంది. దివ్య ప్రేమని అంగీకరించిన చంద్రబోస్ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసే సమయంలో అర్జున్ తాను ఒక సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు. అంతేకాదు డీజీపీ దగ్గరనుండి 250 కోట్లు స్వాధీనం చేసుకుంటాడు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటి…? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

==============================================================================

కళ్యాణ వైభోగమే

నటీనటులు : నాగశౌర్య, మాళవిక నాయర్

ఇతర నటీనటులు : రాశి, ఆనంద్, ప్రగతి, నవీన్ నేని, ఐశ్వర్య, తాగుబోతు రమేష్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణ్ కోడూరి

డైరెక్టర్ : B.V. నందిని రెడ్డి

ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 4 మార్చి 2016

నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కళ్యాణ వైభోగమే. కేవలం పెద్దల బలవంతం పై పెళ్లి చేసుకున్న ఒక యువజంట పెళ్లి తరవాత ఏం చేశారు..? అనేదే ఈ సినిమా ప్రధానాంశం. యూత్ ఫుల్ కామెడీ ఈ సినిమాలో పెద్ద హైలెట్.

==============================================================================

 

 

ఒంగోలు గిత్త

నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

==============================================================================

 

 

పిల్ల జమీందార్

నటీనటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి

ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్

డైరెక్టర్ : G. అశోక్

ప్రొడ్యూసర్ : D.S. రావు 

రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011

న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి చేసిన సినిమా ఇదే. 

==============================================================================

మున్నా

నటీనటులు : ప్రభాస్, ఇలియానా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రాహుల్ దేవ్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, పోసాని కృష్ణ మురళి, వేణు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : వంశీ పైడిపల్లి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 2, మే  2007

ప్రభాస్, ఇలియానా జంటగా నటించిన పర్ ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ యాక్షన్, హారిస్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

జై చిరంజీవ

నటీనటులు : చిరంజీవిభూమిక చావ్లాసమీరా రెడ్డి

ఇతర నటీనటులు : అర్బాజ్ ఖాన్బ్రహ్మానందంజయ ప్రకాష్ రెడ్డిరాహుల్ దేవ్సునీల్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : K. విజయ భాస్కర్

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2005

మెగాస్టార్ కరియర్ లో బెస్ట్ గా నిలిచిన సినిమా జై చిరంజీవ. తన మేనకోడలిని చంపిన క్రిమినల్స్ ని రీచ్ అవ్వడానికి హీరో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ‘జై చిరంజీవ’ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.