పోలీస్ గా మారిన సంగీత దర్శకుడు

Friday,September 13,2019 - 12:01 by Z_CLU

సంగీత దర్శకుడు కోటి గురించి ప్రతి ప్రేక్షకుడికి తెలుసు. తన మ్యూజిక్ తో కొన్ని తరాల ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాడాయన. అలాంటి మ్యూజిక్ డైరక్టర్ కాస్తా ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా మారిపోయాడు. అవును.. దేవినేని సినిమాలో పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు కోటి. ఈ చిత్రంలో 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కెఎస్ వ్యాస్ పాత్రను కోటి పోషిస్తున్నారు. ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.

ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. నందమూరి తారకరత్న టైటిల్ రోల్ లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు..

బెజవాడలో ఇద్దరు మహనాయకుల మధ్య స్నేహం, వైరం తో పాటు కుటుంబనేపథ్యంలో సెంటిమెంట్ ను జోడిస్తూ నడిచే ఈ సినిమాలో బెజవాడ లోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు.చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు.