‘సువర్ణ సుందరి’ట్రైలర్ రివ్యూ

Wednesday,February 06,2019 - 02:56 by Z_CLU

సువర్ణ సుందరి థియేట్రికల్ ట్రైలర్ రిలీజయింది. ‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతోంది’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కంప్లీట్ గా ఒక విగ్రహం చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. ఆ విగ్రహం దగ్గరగా ఉన్నప్పుడు జరిగే వింత పరిణామాలే సినిమాలో హై పాయింట్స్.

సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి కుమార్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లా కనిపించనున్నాడు. పూర్ణ, ఈ సినిమాలో జయప్రదకి తల్లిగా కనిపించనుంది. ఈ క్యారెక్టర్స్ మధ్య సాక్షి చౌదరి క్యారెక్టర్ ఏమై ఉంటుందా అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుందీ ట్రైలర్.

1:50 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ జస్ట్ అవుట్ స్టాండింగ్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ స్టోరీ అయితే ఎక్కడా రివీల్ కాలేదు కానీ, ట్రైలర్ లో రివీల్ అవుతున్న ప్రొడక్షన్ వ్యాల్యూస్, సినిమాని వైడ్ రేంజ్ లో రీచ్ అయ్యేలా చేస్తున్నాయి.

ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఉన్న ఈ సినిమాకి M.S.N. సూర్య డైరెక్టర్. సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.  M.L. లక్ష్మి ఈ సినిమాకి ప్రొడ్యూసర్.