అఖిల్ నెక్స్ట్ సినిమా అదే !

Wednesday,February 06,2019 - 01:28 by Z_CLU

‘మిస్టర్ మజ్ను’ తర్వాత అఖిల్ చేయబోయే నెక్స్ట్ సినిమా ఏంటి..? ఇప్పటికే ఆల్మోస్ట్ లాక్ అయిన ఆ డైరెక్టర్ ఎవరు..? సోషల్ మీడియాలో అయితే రీసెంట్ గా ‘మలుపు’ సినిమాతో  మెస్మరైజ్ చేసిన దర్శకుడు సత్య పినిశెట్టి పేరు గట్టిగా వినిపిస్తుంది.

‘మిస్టర్ మజ్ను’ సినిమా సెట్స్ పై ఉండగానే సత్య అఖిల్ కి స్టోరీలైన్ చెప్పినట్టు తెలుస్తుంది. ఈ న్యూస్ విషయంలో ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ, రీసెంట్ గా ‘మిస్టర్ మజ్ను’ ప్రమోషన్స్ లో భాగంగా,  మ్యాగ్జిమం ఫిబ్రవరిలో కొత్త సినిమా అనౌన్స్ చేస్తానని అఖిల్ మెన్షన్ చేయడంతో ఫ్యాన్స్ కాన్సంట్రేషన్, అఖిల్ నుండి నెక్స్ట్ రాబోయే అప్డేట్ పై ఫిక్సయి ఉంది.

ఇంతకీ అఖిల్ నెక్స్ట్ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది..? ఈసారి కూడా మరో ఇమోషనల్ లవ్ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నాడా..? మరేదైనా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సెట్స్ పైకి వస్తాడా అనేది తెలియాల్సి ఉంది.