జయప్రద ‘సువర్ణ సుందరి’ టీజర్ రిలీజయింది

Thursday,November 09,2017 - 06:28 by Z_CLU

‘చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతుంది’ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ‘సువర్ణ సుందరి’ టీజర్ రిలీజయింది. జయప్రద తో పాటు పూర్ణ, సాక్షి చౌదరి లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో సాయి కుమార్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. హిస్టారికల్ అడ్వెంచరస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ హైలెట్ కానున్నట్టు తెలుస్తుంది.

డిసెంబర్ కల్లా ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్, ఫాస్ట్ పేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. M.S.N. డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. M.L. లక్ష్మి ఈ సినిమాకు నిర్మాత.