పెళ్లికి రెడీ.. ప్రకటించిన సీనియర్ హీరోయిన్

Thursday,August 01,2019 - 12:39 by Z_CLU

సుస్మిత సేన్.. 18 ఏళ్లకే ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందించిన ముద్దుగుమ్మ. ఆ తర్వాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కూడా ఓ వెలుగు వెలిగింది. సినిమాల సంగతి పక్కనపెడితే ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్. దీనికి కారణం ఆమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడమే. ఎట్టకేలకు సుస్మిత సేన్ పెళ్లి మేటర్ అఫీషియల్ అయింది.

అవును.. 43 ఏళ్ల సుస్మితసేన్ పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. కొన్నాళ్లుగా మోడల్ రెహ్మాన్ షా తో డేటింగ్ చేస్తోంది సుస్మిత. ఈ ఏడాది నవంబర్ లో అతడ్ని పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. సుస్మిత కంటే ఇతడు 14 ఏళ్ల చిన్నవాడు.

తను జీవితంలో పెళ్లి చేసుకోనని సుస్మిత సేన్ ఎన్నోసార్లు ప్రకటించింది. పెళ్లిపై తనకు నమ్మకం లేదని, అందుకే పిల్లల్ని దత్తత తీసుకున్నానని తెలిపింది. కానీ ఇన్నాళ్లకు ఆమెకు పెళ్లిపై మనసుమళ్లింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సుస్మిత పెళ్లి మేటర్ హాట్ టాపిక్ గా మారింది.