రీఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చిన పవన్

Thursday,August 01,2019 - 12:29 by Z_CLU

పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నారట
కథలు రెడీ చేసుకోమని చెప్పారట
3 రోజులుగా సోషల్ మీడియాలో నలుగుతున్న రూమర్ ఇది. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత పవన్ కల్యాణ్ మరోసారి కెమెరా ముందుకొస్తారని, మంచి కథతో రీఎంట్రీ ఇస్తారని గాసిప్స్ ఊపందుకున్నాయి. వీటిపై పవన్ మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తన రీఎంట్రీ లేదని స్పష్టంచేశాడు.

తనకు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని గతంలోనే క్లారిటీ ఇచ్చిన పవన్, తాజాగా మరోసారి తన రీఎంట్రీపై స్పందించాడు. పార్టీని బలోపేతం చేయడంపైనే తన ఫోకస్ మొత్తం ఉందని, సినిమాల గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదని చెప్పేశాడు.

తనకు బాగా క్లోజ్ గా ఉండే కొంతమంది నిర్మాతలు సినిమాలు చేయమని అడుగుతున్నారని, ఆల్రెడీ కొత్త ప్రభుత్వం వచ్చేసింది కాబట్టి, ఓ 2 సినిమాలు చేయడంలో తప్పులేదని అంటున్నారని… తనకు మాత్రం అలాంటి ఉద్దేశం లేదని కార్యకర్తల సమావేశంలో క్లియర్ గా చెప్పేశాడు  పవన్.

పవన్ వద్ద సినిమాలకు సంబంధించి ఇప్పటికీ కొన్ని అడ్వాన్సులు అలానే ఉన్నాయి. వాటిని తన ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా చూపించాడు. ఎన్నికల తర్వాత అతడు మరోసారి సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరగడానికి మెయిన్ రీజన్ ఇదే. పవన్ మాత్రం క్లియర్ గా చెప్పేశాడు. ఇకపై ఓన్లీ పాలిటిక్స్.. నో సినిమా.